మార్పు/change- Sri Lakshmi Bhavani Nandamuri

మార్పు

సంపదతో సమయం కొనగలమా?

అందంతో ప్రేమ పొందగలమా?

విజ్ఘ్యానంతో విఘ్న్యత గడించగలమా?

వనరులుతో వయస్సు తరిగించగలమా?

భౌతికవాదముతో స్పందన నొసగునా?

ఆడంబరములతో ఆనందం ప్రాప్తించగలదా?

జీతముతో జీవితపు విలువ త్రూయగలమా?

భోజనంతో భుక్తి తీర్చగలము,

ఆలోచనతో ఆర్తి తరిగించగలము,

ఆచరణతో ఆదర్శము కాగలము,

నేర్పుతో నవశఖము వ్రాయగలము,

ప్రాకృతిక స్వేచ్చలో ప్రేరణ పొందగలము,

ప్రయత్నముతో ప్రపంచము జయించగలము,

స్పూర్తితో విశ్వపు మూలాలనే చేధించగలము,

మాయ నుంచి ముక్తి వైపు మలుచుకుందాం..

ఆశ నుంచి ఆశయం వైపు అడుగులు వేద్దాం..

గమనం నుంచి గమ్యం వైపు సాగుదాం..