Prema | Pavankumar Mamidi

THE FOLLOWING POEM WAS SELECTED IN WINGWORD POETRY PRIZE 2023 LONGLIST.

ప్రేమంటే నువ్వా, నీ కోసం బ్రతికే నేనా..

ప్రేమంటే నువ్వా, నీ కోసం బ్రతికే నేనా..

సరిగమపదనిస రాగపు స్వరమా

తొలకరి పలుకుల ప్రేమ కుసుమమా

నా కోసం పుట్టావనిపించే నువ్వేనా ప్రేమా..

ప్రేమంటే నువ్వా, నీ కోసం బ్రతికే నేనా..

ప్రేమంటే నువ్వా, నీ కోసం బ్రతికే నేనా..

కలలోనైనా కనిపించని ఇలాంటి అందం

ఇలలో నువ్వై ఎదురొచ్చే ప్రతి నిమిషం

కడలై తాకే చలచల్లని నీ ప్రేమ వర్షం

అడగక ముందే నాకందిన గొప్ప వరం.

వలపుల తలపుల గానపు స్వరమా

కలలను నిజముగ మార్చిన వరమా

నా కోసం పుట్టావనిపించే నువ్వేనా ప్రేమా........

చిరునవ్వులతో పయనించిన మధుర ప్రయాణం

పరిణయ సుమమై విరబూసే అనుక్షణం

మనసున మనసై మురిపించిన ఈ ప్రేమ బంధం

ఏడడుగులతో అవ్వాలిక శతమానం.

ప్రేమంటే నువ్వా, నీ కోసం బ్రతికే నేనా..

ప్రేమంటే నువ్వా, నీ కోసం బ్రతికే నేనా..

సరిగమపదనిస రాగపు స్వరమా

తొలకరి పలుకుల ప్రేమ కుసుమమా

నా కోసం పుట్టావనిపించే నువ్వేనా ప్రేమా..